Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. చిరంజీవి కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయిన 'కొదమ సింహం' సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది.
ఈ సినిమాను 4K కన్వర్షన్‌తో, కొత్త డిజిటల్ సౌండింగ్‌తో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత కైకాల నాగేశ్వరావు తెలిపారు. కె. మురళీమోహన్ రావు దర్శకత్వంలో 1990లో వచ్చిన ఈ కౌబాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పట్లో పెద్ద విజయం సాధించింది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే మోహన్ బాబు, ప్రాణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మెగాస్టార్ అభిమానులు మరోసారి తమ అభిమాన నటుడి అద్భుతమైన నటనను, స్టైల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.