Kollywood's Top Actor Suriya: ఎనర్జీకి రూపం రవితేజ
ఎనర్జీకి రూపం రవితేజ
Kollywood's Top Actor Suriya: రవితేజ మాస్ జాతర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య తన ప్రసంగంలో రవితేజపై తన అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేస్తూ, ఆయన ఎనర్జీని ప్రత్యేకంగా ప్రశంసించారు.రవితేజ గారిని కలవడం తనకు ఫ్యాన్‌బాయ్ మూమెంట్"లా అనిపించిందని సూర్య తెలిపారు. "నేను, జ్యోతిక, కార్తి... ఇంట్లో రవితేజ గారి గురించి చాలా మాట్లాడుకుంటాం" అని తమ కుటుంబంలో రవితేజకు ఉన్న స్థానాన్ని వివరించారు.
ఎనర్జీకి ఒక రూపం ఉంటే అది రవితేజే అని, రవితేజ అంటేనే "ఎనర్జీకి డెఫినిషన్" అని ప్రశంసించారు.సామాన్య నేపథ్యం నుంచి వచ్చి, ఇన్నేళ్లుగా ప్రేక్షకులను అలరించడం, తెరపై కామన్ మ్యాన్ పాత్రలను కింగ్ సైజ్‌లో చూపించడం మామూలు విషయం కాదని రవితేజను అభినందించారు.కామెడీ పండించడం చాలా కష్టమని, ఈ విషయంలో రవితేజకు ప్రత్యేక శైలి ఉందని, ఆయన హాస్యాన్ని రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లతో పోల్చారు.
తన సోదరుడు కార్తీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం 'సిరుతై', అది రవితేజ నటించిన 'విక్రమార్కుడు' సినిమాకి తమిళ రీమేక్ అని గుర్తు చేశారు. పరోక్షంగా ఈ సినిమా రవితేజ తన సోదరుడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు.'మాస్ జాతర' టీమ్ మొత్తానికి సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.సూర్య ప్రస్తుతం 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌లోనే తన కొత్త సినిమా (సూర్య 46) చేస్తున్నందున, ఆ బ్యానర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.