Hebah Patel: లాస్ట్ డే.. మెంటల్లీ డన్.. హెబ్బా పటేల్ ఫోటోలు వైరల్
హెబ్బా పటేల్ ఫోటోలు వైరల్;
Hebah Patel: హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నా స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్ గా మాత్రం రాణించలేదు. ఇక రీసెంట్ గా ఓదెల 2 మూవీతో మన ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఉంటుందీ అమ్మడు. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ షేర్ చేసింది. అందులో లాస్ట్ డే అని చీరలో పల్లెటూరి అమ్మాయిలా ఉన్న ఫొటో, మెంటల్లీ డన్ అని బాగా అలసిపోయి ఉన్న ఫొటో షేర్ చేసింది. ఈ రెండు ఫొటోలు నెట్టింట్ వైరల్ గా మారాయి. ఇంతకూ ఏమిటీ లాస్ట్ డే? అన్నది ఆసక్తికరంగా మారింది. 1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది.