Prabhas’s ‘Spirit’: ప్రభాస్ స్పిరిట్ నుంచి లేటెస్ట్ అప్ డేట్
లేటెస్ట్ అప్ డేట్
Prabhas’s ‘Spirit’: రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయి పోతుంది. అయితే గతేడాది చివర్లో ఈ మూవీ షూటింగ్ అధికా రికంగా స్టార్అయినప్పటికీ, ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులకు మాత్రం చిన్న బ్రేక్ లభించింది. దర్శకుడు సందీప్ వంగా నటీనటుల ఎంపిక. ఇతర ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు ప్రభాస్ 'ఫౌజీ', 'కల్కి 2898 ఏడీ; పార్ట్ 2' పనులతో ఫుల్బాజీగా ఉన్నాడు.
అయితే 'స్పిరిట్' కోసం ప్రభాస్ ఒక సరికొత్త మేకోవర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన తన ఫిజిక్ను మరింత ఫిట్గా, ఇంటెన్స్ గా మార్చుకునే పనిలో ఉన్నాడు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ ఏడాది మే ఫస్ట్ వీక్ లో ప్రారంభం కానున్న ట్లు సమాచారం. అప్పటి నుంచి ఎటువంటి బ్రేక్ లేకుండా షూటింగ్ జరపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.