Lawrence’s Daughter: లారెన్స్ కూతురు గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్‌గా కాదు.. సొంత బ్యానర్‌లోనే లక్కీ ఛాన్స్..
సొంత బ్యానర్‌లోనే లక్కీ ఛాన్స్..
Lawrence’s Daughter: కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు తన సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజీ కాంచన-4, మరోవైపు లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్న బెంజ్, అలాగే ప్రతిష్ఠాత్మక చిత్రం కాలభైరవ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా లారెన్స్ ఫ్యామిలీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే సినీ రంగప్రవేశం
చేయబోతున్నారు.
సాధారణంగా స్టార్ హీరోల వారసులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తే హీరోయిన్లుగా కెరీర్ స్టార్ట్ చేస్తుంటారు. కానీ రాఘవి మాత్రం అందరి రూట్‌కు భిన్నంగా ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పరిశ్రమకు పరిచయం కాబోతుండటం విశేషం.
అమెరికాలో డైరెక్షన్ కోర్సు.. నో అసిస్టెంట్ ఎక్స్‌పీరియన్స్..
రాఘవికి చిన్నప్పటి నుండే సినిమా మేకింగ్, కథలు రాయడం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేదట. ఈ ప్యాషన్‌తోనే ఆమె అమెరికా వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు కూడా పూర్తి చేసింది. సాధారణంగా ఎవరైనా డైరెక్టర్ కావాలంటే పెద్ద దర్శకుల దగ్గర కొన్ని ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం సంపాదిస్తారు. కానీ, రాఘవి మాత్రం ఎలాంటి ముందస్తు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా, నేరుగా దర్శకురాలిగా మొదటి సినిమాను టేకాఫ్ చేసేందుకు సిద్ధమై పెద్ద రిస్క్ తీసుకుంటోంది.
లారెన్స్ గ్రీన్ సిగ్నల్.. సొంత నిర్మాణంలోనే సినిమా..
కూతురి ఇష్టాన్ని, ఆమె నైపుణ్యాన్ని నమ్మిన రాఘవ లారెన్స్.. దర్శకురాలిగా మారాలనే రాఘవి నిర్ణయానికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, ఆమె చేయబోయే డెబ్యూ సినిమాను వేరే ప్రొడ్యూసర్స్ చేతుల్లో పెట్టకుండా తన సొంత బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి లారెన్స్ స్వయంగా పూనుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను హీరోగా పెట్టి సినిమాలను సపోర్ట్ చేస్తున్న రాఘవ లారెన్స్.. ఇప్పుడు తన కూతురిని కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా పరిచయం చేస్తూ, తన కుటుంబం నుండి మరో కొత్త టాలెంట్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తుండటం గమనార్హం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.