Rashmika: మీ నుంచి చాలా నేర్చుకున్నా.. ధనుష్ పై రష్మిక పోస్ట్!
ధనుష్ పై రష్మిక పోస్ట్!;
Rashmika: కోలీవుడ్ స్టార్ ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కుబేర.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ఇందులో సమీరా పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మిక ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రంలో తన కోస్టార్ ధనుష్ పై ప్రశంసలు కురిపించింది. ఆయన సింప్లిసిటీని గురించి వివరిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. 'మీతో అంత పెద్ద సినిమా చేసినప్పటికీ మనిద్దరిది ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది. మీరు అద్భుతమైన వ్యక్తి. మనం మట్లాడుకున్న ప్రతిసారీ వేర్వేరు నగరాల్లో ఉన్నాం. రెస్ట్ ఎంత ముఖ్యమో చర్చించేవాళ్లం. కానీ, విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. కుబేర నటనపరంగానే కాదు.. నిజ జీవితంలోనూ మీరు చేసే పనులు ఎంతోమందికి ఆదర్శం. చుట్టూ ఉన్నవారితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా నడు చుకుంటారు. ముఖ్యంగా మీరు సెట్ లో నాకోసం తెచ్చిన లడ్డూ లను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు తమిళ డైలాగుల్లో మీరు చేసిన సాయం.. నేను ఏదైనా డైలాగు చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు.. కానీ, జీవితమంతా గుర్తుంటాయి' అంటూ ధనుష్ తో దిగిన సెల్ఫీని షేర్ చేసింది.. ప్రజంట్ ఈ అమ్మడి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.