Rakul Preet Singh: ఈ రోజు చీరనే మాట్లాడనివ్వండి.. రకుల్ ఫొటోలు వైరల్

రకుల్ ఫొటోలు వైరల్;

Update: 2025-06-21 05:28 GMT

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో కుర్రకారు మనసును కట్టిపడే సింది ఈచిన్నది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు, ఆతర్వాత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. రకుల్ ప్రీత్ సింగ్ చివరగా 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమాలో కనిపించింది. ప్రస్తు తం ఈభామ చేతిలో ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 సినిమాలు ఉన్నాయి. కాగా.. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుని.. పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు గ్లామర్ వలకబోస్తూ యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా రకుల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతు న్నాయి. గ్రీన్ కలర్ చీరకట్టులో హాట్ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ను కూల్ గా మత్తె క్కిస్తోంది. ఈపిక్స్ కుల 'ఈ రోజు చీరనే మాట్లాడనివ్వండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ పోస్ట్ చూసిన అభి మానులు లవ్, హార్ట్, ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు. కాగా 10 అక్టోబర్ 1990న న్యూఢిల్లీలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తండ్రి భారత సైన్యంలో ఉన్నతాధికారి. తండ్రి ఉద్యోగ రీత్యా ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఓ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. అనంతరం జీసస్ అండ్ మేరీ కాలేజ్‌లో మ్యాథమేటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. పాకెట్ మనీ కోసం తొలుత మోడలింగ్ చేసిన రకుల్.. చదువు పూర్తయ్యాకే అటువైపు అడుగులు వేశారు. ఈ దశలో 2009లో కన్నడంలో గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రకుల్ ప్రీత్ సింగ్.

Tags:    

Similar News