M. S. Raju’s New Thriller Announced: ప్రేమకథల దర్శకుడు ఇప్పుడు భయపెట్టబోతున్నాడు: ఎం.ఎస్. రాజు కొత్త హారర్ థ్రిల్లర్

ఎం.ఎస్. రాజు కొత్త హారర్ థ్రిల్లర్

Update: 2026-04-13 09:23 GMT

M. S. Raju’s New Thriller Announced: తెలుగు సినీ పరిశ్రమలో ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘ఒక్కడు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి మరుపురాని ప్రేమకథా చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. గతంలో ‘డర్టీ హరి’ వంటి సినిమాతో తన రూటు మార్చిన ఆయన, ఇప్పుడు పూర్తిగా హారర్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టును ప్రకటిస్తూ ఆయన ఒక ఆసక్తికరమైన టీజర్‌ను వదిలారు.

ఈ టీజర్‌లో ‘మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేసిన వ్యక్తి.. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టబోతున్నాడు’ అనే లైన్‌ను జోడించి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఒకప్పుడు మనసును హత్తుకునే ప్రేమకథలను అందించిన దర్శకుడు, ఇప్పుడు హారర్ థ్రిల్లర్‌తో ఎలా భయపెడతారా అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 15, 2026న వెల్లడించనున్నట్లు ఆయన ప్రకటించారు.

భావోద్వేగాలతో కూడిన కథలను చెప్పడంలో ఎం.ఎస్. రాజుకు మంచి పట్టు ఉంది. అందుకే ఆయన చేస్తున్న ఈ హారర్ ప్రయత్నం తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ ప్రకటనతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమాపై చర్చ మొదలైంది.

Tags:    

Similar News