Samantha’s New Look Revealed: 'మా ఇంటి బంగారం' అప్‌డేట్: సమంత కొత్త లుక్

సమంత కొత్త లుక్

Update: 2026-01-07 07:10 GMT

Samantha’s New Look Revealed: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన తదుపరి చిత్రం మా ఇంటి బంగారంతో తెలుగు వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఈరోజు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు టీజర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సమంత బ్రౌన్ కలర్ చీర కట్టుకుని, బస్సులో నిలబడి సీరియస్ లుక్‌తో కనిపిస్తోంది. ట్రెడిషనల్ లుక్‌లో ఉన్నప్పటికీ, ఆమె కళ్లలో కనిపిస్తున్న తీక్షణత ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా అని స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సమంత భర్త, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే ద్వయం) ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో రాజ్, సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. దీనిని సమంత సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'పై ఆమె స్వయంగా నిర్మిస్తోంది. 'ఓ బేబీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రం యొక్క టీజర్ ట్రైలర్‌ను జనవరి 9, శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు ఈ 'బ్లాస్ట్' ఉండబోతోంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ పనిచేస్తుండగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కథ , స్క్రీన్‌ప్లే బాధ్యతలను వసంత్ మరింగంటి చేపట్టారు.

Tags:    

Similar News