Maari 2 Combo Repeats: మారి 2 కాంబో రిపీట్.. ఇద్దరు హీరోయిన్లతో ధనుష్
ఇద్దరు హీరోయిన్లతో ధనుష్
Maari 2 Combo Repeats: మెగా ప్రాజెక్ట్ ‘అమరన్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి, ఇప్పుడు ధనుష్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాత్కాలికంగా #D55 అని పిలుస్తున్న ఈ చిత్రంలోకి ప్రముఖ నటి సాయి పల్లవిని చిత్ర బృందం సోమవారం సాదరంగా ఆహ్వానించింది. "ఆమెలో హుందాతనం, శక్తి రెండూ కలగలిసి ఉన్నాయి.
అందరి ఫేవరెట్ సాయి పల్లవికి స్వాగతం. హిట్ కాంబో మళ్లీ వెండితెరపైకి వస్తోంది అంటూ ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. గతంలో ధనుష్, సాయి పల్లవి కలిసి ‘మారి 2’లో నటించారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రౌడీ బేబీ’ పాట ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తున్నట్లు జనవరి 30న మేకర్స్ ప్రకటించారు. ఒకే సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు (సాయి పల్లవి, శ్రీలీల) ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వీరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా యువ సంచలనం సాయి అభ్యంకర్ ను ఎంపిక చేశారు. 'కుర్చి మడతపెట్టి' వంటి వైరల్ సాంగ్స్‌తో పాపులర్ అయిన అభ్యంకర్, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం తన డ్రీమ్ కొల్లాబరేషన్ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి ఆర్ టేక్ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాజ్‌కుమార్ పెరియాసామి దీనిని ఒక 'మాగ్నమ్ ఓపస్' (అద్భుత కావ్యం) లాగా తీర్చిదిద్దుతున్నారని మేకర్స్ చెబుతున్నారు. భారీ తారాగణం, కొత్త మ్యూజిక్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.