Mad Movie Heroine: మ్యాడ్ హీరోయిన్ .. 19 ఏళ్లకే ఇంత టాలెంటెడా?
19 ఏళ్లకే ఇంత టాలెంటెడా?;
Mad Movie Heroine: ‘మ్యాడ్' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్. కేరళకి చెందిన ఈ టీనేజీ అమ్మాయి ఆ సినిమాలో క్యూట్ గా కనిపిస్తూ చక్కటి నటనతో ఆకట్టుకుంది. అందులో ఆమెను చూసి యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు' సినిమాలో అవకాశమిచ్చాడు. డ్రామా అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్ ' ఈ చిత్రాన్ని నిర్మించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మూవీ ప్రమోషన్స్ భాగంగా నిన్న జరిగిన '8 వసంతాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతిక మల్టీ టాలెంట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఈ అమ్మాయిలో ఇన్ని కళలున్నాయా అంటూ నోరెళ్లబెట్టి చూశారు. నటిగానే కాకుండానే క్లాసికల్ డ్యాన్స్ తో పాటు 'సాగర సంగమం'లోని ఓ పాటకు ఆమె అద్భుతంగా అభినయించింది. దీనికి తోడు అనంతిక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరో ఎత్తు. స్టేజ్ మీద తన ప్రతిభ మరింత ఎలివేట్ అయింది. కేవలం 19 ఏండ్ల వయసులోనే ఇంత పరిణితిని కనబరుస్తోన్న అనంతికపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనంతిక కుమార్ కేరళలో పట్టి పెరిగింది. 2 ఫిబ్రవరి 2006లో జన్మించింది.చిన్నప్పటి నుంచే అనంతి కుమార్ కళల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉండేది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉండేది. అలా సినిమా అవకాశాలు అందుకుంది. తన తల్లి జీనీ ప్రోత్సాహంతోనే యాక్టింగ్ ను తన కెరీయర్ గా మలుచుకుంది. ఆమె లాయర్ డిగ్రీని పొందడం విశేషం.