Madhuri Eliminated from Bigg Boss: బిగ్ బాస్ నుంచి మాధురి ఎలిమినేట్.. హౌస్‌లో ఉండే అర్హత లేదని కామెంట్స్

హౌస్‌లో ఉండే అర్హత లేదని కామెంట్స్

Update: 2025-11-03 08:42 GMT

Madhuri Eliminated from Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని పరిణామం జరిగింది. దువ్వాడ మాధురి కేవలం రెండు వారాల్లోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఆమెకు అత్యల్ప ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చారు. మాధురితో పాటు సంజన, రీతూ చౌదరి, కల్యాణ్‌, తనూజ, రాము, డిమోన్‌ పవన్‌, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గౌరవ్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.చివరి నిమిషం వరకు గౌరవ్‌, మాధురి మధ్యే ఎలిమినేషన్ కోసం గట్టి పోటీ నడిచింది.

హౌస్ నుంచి బయటకు వచ్చేముందు మాధురి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ పుట్టినరోజు ఉన్నందున, ఈ సమయంలో హౌస్ బయట ఉండడం తనకు సంతోషాన్నిస్తుందని ఆమె అన్నారు. కల్యాణ్‌, డిమోన్ పవన్, తనూజ చాలా మంచివాళ్లని ఆమె ప్రశంసించారు. కంటెస్టెంట్ భరణిపై మాధురి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హౌస్‌లో ఉండే అర్హత భరణికి లేదని.. "అందరూ వెనుక నుంచి పొడిస్తే, అతను మాత్రం సూటిగా పొడుస్తున్నాడు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వెళ్లారు.

Tags:    

Similar News