Mahesh–Rajamouli’s ‘Varanasi’: మహేశ్ - రాజమౌళి వారణాసి.. సైన్స్ ఫిక్షన్ కాదు.. ఇది వెయ్యేళ్ల ఫాంటసీ..

సైన్స్ ఫిక్షన్ కాదు.. ఇది వెయ్యేళ్ల ఫాంటసీ..

Update: 2026-02-14 07:33 GMT

Mahesh–Rajamouli’s ‘Varanasi’: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో వస్తున్న వారణాసిపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి వారణాసి అనే పేరును ఖరారు చేయడమే కాకుండా సినిమా జానర్‌పై సాగుతున్న ప్రచారానికి రాజమౌళి తెరదించారు.

సైన్స్ ఫిక్షన్ కాదు.. ఫాంటసీ మైథాలజీ!

విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆటోమేటిక్ వీల్‌చైర్‌లో ఉన్న ఫస్ట్‌లుక్ చూసి, ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని అందరూ భావించారు. అయితే రాజమౌళి దీనిపై స్పందిస్తూ.. "ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఛాయలు ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా ఫాంటసీ - మైథలాజికల్ జానర్‌లో సాగే సినిమా అని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆయన వృషభంపై ఇచ్చే ఎంట్రీ సీన్ టాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప సినిమాటిక్ మూమెంట్ అవుతుందని రాజమౌళి నమ్మకంగా చెప్పారు. ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించిన ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉంటుందని, దాని షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.

ఐమ్యాక్స్ అనుభూతి:

సినిమా మొత్తాన్ని ఐమ్యాక్స్ వెర్షన్‌లో తీయాలని భావించినా, కొన్ని పరిమితుల వల్ల కేవలం కొన్ని కీలకమైన సన్నివేశాలను మాత్రమే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు.

ఒత్తిడి లేదు.. విజయంపై ధీమా..

ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఒత్తిడి ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. "కొత్త సినిమా మొదలుపెట్టినప్పుడు పాత విజయాలను నేను తలకెక్కించుకోను" అని ఆయన సమాధానమిచ్చారు. ఈ సినిమా నిడివి మూడు గంటల కంటే తక్కువగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న వెండితెరపై గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tags:    

Similar News