Malavika Gives Clarity: చిరంజీవికి జోడీగా..క్లారిటీ ఇచ్చిన మాళవిక
క్లారిటీ ఇచ్చిన మాళవిక
Malavika Gives Clarity: ప్రభాస్‌కు జంటగా ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్న మాళవిక మోహనన్.. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటించబోతోందని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది మాళవిక. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. చిరంజీవి కెరీర్‌లో ఇది 158వ చిత్రం. ఇందులో చిరంజీవికి జంటగా మాళవిక మోహనన్ నటించబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
దీనిపై మాళవిక స్పందిస్తూ.. ‘‘బాబి గారు తెరకెక్కిస్తున్న ‘మెగా 158’లో నేను నటిస్తున్నట్టు ఆన్‌లైన్‌లో చాలా వార్తలు వస్తున్నాయి. కెరీర్‌లో ఎప్పటికైనా చిరంజీవి గారి లాంటి ఐకానిక్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. కానీ ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం నేను భాగం కాదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తున్నాను’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఇక ‘ది రాజా సాబ్’తో పాటు తమిళంలో కార్తికి జంటగా ‘సర్దార్ 2’లో మాళవిక నటిస్తోంది.