Actress Malavika Sharma: రాజసం ఉట్టి పడేలా మాళవిక గ్లామర్
మాళవిక గ్లామర్
Actress Malavika Sharma: తెలుగు నటి, మోడల్ మాళవిక శర్మ తాజా గ్లామరస్ ఫొటోషూట్లో అందాల సందడి చేసింది. లావెండర్ రంగు మెరిసే సీక్విస్ చీర, డీప్ నెక్లైన్ బ్లౌజ్, విలువైన డైమండ్ ఆభరణాలతో ఆమెలో రాజసం ఉట్టిపడింది. మెడలోని హారం తాకుతూ ఇచ్చిన చిరునవ్వు ఆమె అందాన్ని మరింత పెంచింది. పాస్టెల్ షేడ్స్, నాజూకైన మేకప్, పొడవాటి జుట్టు మాళవి కను ఫ్యాషన్ ఐకాన్ గా నిలబెట్టాయి. 1999 జనవరి 26న ముంబైలో జన్మించిన మాళవిక శర్మ, సినిమాల్లోకి రాపడాని కి ముందు లా డిగ్రీ పూర్తి చేసి అడ్వొకేట్ గా ప్రాక్టీస్ చేసింది.
అనంతరం మోడలింగ్ వైపు మళ్లి, హిమాలయ, సంతోర్, జియోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీ ప్రకటనల తో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. ఆపై 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ రెడ్ లో రాంపో తినేనికి జోడిగా 'మహిమ' పాత్రలో మెప్పించింది. తమిళంలోకి కాఫీ విత్ కాదల్ తో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక కన్నడ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు గణేశ్ తో కలిసి, దర్శ కుడు శ్రీనివాసరాజుతెరకెక్కి స్తున్నఓ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో ఆమె నటించనుంది.