Malla Reddy’s Daughter-in-Law: నవీన్ పొలిశెట్టితో మాల్లారెడ్డి కోడలు మాస్ డ్యాన్స్
మాల్లారెడ్డి కోడలు మాస్ డ్యాన్స్
Malla Reddy’s Daughter-in-Law: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు. ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమాలోని రాజు గారి పెళ్లిరో అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల ఈలలు, కేకల మధ్య ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నవీన్ కష్టానికి ప్రీతి రెడ్డి ప్రశంసలు
ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ నవీన్ పొలిశెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాణించడం చాలా కష్టమని, నవీన్ తన స్వయంకృషితో ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని ఆమె అన్నారు. పరిశ్రమలో ఎదుగుతున్న వారిని కిందకు లాగేవారు ఉంటారని, అన్ని అడ్డంకులను దాటుకుని, నిద్రలేని రాత్రులు గడిపి నవీన్ ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె కొనియాడారు.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.