Mana Shankara Varaprasad Garu: మన శంకరవరప్రసాద్ గారు.. 25 రోజుల్లోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశా

25 రోజుల్లోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశా

Update: 2026-01-14 13:23 GMT

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన "మన శంకరవరప్రసాద్ గారు" సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ 'మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్' (Press Meet) నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశానని చెప్పారు. సాధారణంగా తాను ఒక కథ రాయడానికి 3 నుంచి 4 నెలలు తీసుకుంటానని, కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజుల్లో, సెకండాఫ్ కేవలం 10 రోజుల్లో కలిపి మొత్తం 25 రోజుల్లోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.150 సినిమాలు చేసిన మెగాస్టార్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన సెట్స్‌లో 150 సినిమాలు చేసిన హీరోలా కాకుండా, ఒక నూతన నటుడిలా (ఆర్టిస్ట్‌గా) మా అందరితో కలిసిపోయేవారు."నేను చెప్పిన క్యారెక్టరైజేషన్ కోసం ఆయన బరువు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. గ్రాము బరువు పెరిగినా నా అంచనా తప్పుతుందేమోనని ఎంతో కష్టపడి తనను తాను మార్చుకున్నారు.

ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే వింటేజ్ చిరు (Vintage Chiru) ను ఈ సినిమాలో చూపించగలిగాననే నమ్మకం తనకు ఉందని, దానికి తగ్గట్టుగానే థియేటర్లలో రెస్పాన్స్ వస్తోందని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, డ్యాన్స్, గ్రేస్ మళ్ళీ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పండాయని ఆయన అన్నారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు 'వెంకీ గౌడ'గా చేసిన స్పెషల్ రోల్ గురించి మాట్లాడుతూ.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయని, వారిద్దరూ ఆ సీన్స్ చేస్తున్నప్పుడు తాను ఎంతో ఎంజాయ్ చేశానని అనిల్ చెప్పారు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఇండియాలో సుమారు రూ. 61 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని, ఓవర్సీస్‌లో కూడా 1 మిలియన్ మార్కును దాటేసిందని అనిల్ రావిపూడి గర్వంగా ప్రకటించారు.

Tags:    

Similar News