Manchu Manoj: డేవిడ్ రెడ్డిగా మంచు మనోజ్ యాక్షన్ దండయాత్ర.. ఫిల్మ్ సిటీలో స్పెషల్ సాంగ్, భారీ క్లైమాక్స్ షూట్
ఫిల్మ్ సిటీలో స్పెషల్ సాంగ్, భారీ క్లైమాక్స్ షూట్
Manchu Manoj: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సరికొత్త పీరియాడిక్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ టైటిల్ రోల్‌లో ఒక పవర్‌ఫుల్ యోధుడిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. భరత్ మోటుకూరి, వెంకట్ రెడ్డి నల్ల గంగుల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విదేశీ భామ, ర్యాబోషాప్కా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ దాదాపు నెల రోజులుగా శరవేగంగా జరుగుతోంది.
బాలీవుడ్ బ్యూటీ సౌండస్ మౌఫకీర్‌పై కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ నేతృత్వంలో ఓ మాస్ స్పెషల్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు మనోజ్, రమ్యకృష్ణ, సముద్రఖనిలపై అత్యంత కీలకమైన పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పోరాట ఘట్టం వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ పేర్కొంది. బ్రిటిష్ పాలనా కాలంలో, 1897 నుంచి 1920 మధ్య కాలంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.