Manoj Mark Mania: మనోజ్ మార్క్ మేనియా: ఒకేసారి మూడు క్రేజీ అప్‌డేట్స్!

ఒకేసారి మూడు క్రేజీ అప్‌డేట్స్!

Update: 2026-05-21 08:05 GMT

Manoj Mark Mania: రాక్ స్టార్ మంచు మనోజ్ ఈజ్ బ్యాక్! లాంగ్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మనోజ్.. ఇప్పుడు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

డేవిడ్ రెడ్డి - ఇంటెన్స్ యాక్షన్

మొదటిగా, మనోజ్ హీరోగా నటిస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రిటీష్ పాలన కాలంలో రెండు వేల మందిని ఒంటరిగా ఎదుర్కొన్న ఒక పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో మనోజ్ కనిపిస్తున్నారు. టీజర్‌లో మనోజ్ బాడీ లాంగ్వేజ్, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. హనుమా రెడ్డి యక్కంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

యాక్షన్‌తో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించేందుకు సిద్ధమయ్యారు మనోజ్. ‘బిందాస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘వడ్డీ కాసుల వాడ’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ‘తేజ్ ఉప్పలపాటి’ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే.. ఇది పక్కా మనోజ్ మార్క్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది.

బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ రోల్

ఇక అన్నిటికంటే పెద్ద సర్ ప్రైజ్.. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో మనోజ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం! గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో బాలయ్య గెస్ట్ రోల్ చేయగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల తర్వాత మనోజ్ ఒక డార్క్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో బాలయ్యతో తలపడబోతున్నారు.

Tags:    

Similar News