Mrunal Thakur’s Shocking Reaction: ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్షన్!

మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్షన్!

Update: 2026-02-13 07:44 GMT

Mrunal Thakur’s Shocking Reaction: ధనుష్‌తో పెళ్లి వార్తలపై స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో మృణాల్, తమిళ స్టార్ హీరో ధనుష్ వివాహం చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. మృణాల్ స్వయంగా ఈ విషయాన్ని ఖరారు చేసిందంటూ కొన్ని అన్ వెరిఫైడ్ పోస్ట్లు వైరల్ అవ్వడంతో ఈ పుకార్లు మరింత ముదిరాయి. అయితే తాజాగా తన కొత్త సినిమా ‘దో దివానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు.

ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మృణాల్ నవ్వుతూ స్పందిస్తూ.. అసలు ఈ పుకార్లు ఎవరు మొదలుపెట్టారో అర్థం కావడం లేదన్నారు. "నేను పెళ్లి చేసుకుంటున్నానా? అస్సలు లేదు. బహుశా ఫిబ్రవరి 14వ తేదీని ఎవరో ఏప్రిల్ ఫూల్స్ డేగా మార్చేసినట్టున్నారు. నేను అధికారికంగా పెళ్లిని కన్ఫర్మ్ చేశానని కొంతమంది అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా భయంకరమైన విషయం" అని ఆమె కుండబద్దలు కొట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో నడుస్తున్న పెళ్లి గాసిప్స్‌కు తెరపడినట్లయింది.

నిజానికి ధనుష్, మృణాల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కానీ, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కానీ ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ధనుష్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకుంటున్నారు. ఇక ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కేవలం పుకార్ల ఆధారంగానే ఈ పెళ్లి వార్తలు పుట్టుకొచ్చాయని ఆమె ఇచ్చిన క్లారిటీతో స్పష్టమైంది.

Tags:    

Similar News