Mass Combo on the Cards: మాస్ కాంబో సెట్ అవుతోంది: మారుతి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ!

మాస్ మహారాజా రవితేజ!

Update: 2026-06-24 03:16 GMT

Mass Combo on the Cards: టాలీవుడ్‌లో సరికొత్త క్రేజీ కాంబినేషన్‌కు అడుగులు పడుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మాస్ మహారాజా రవితేజ, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దర్శకుడు మారుతి కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల రవితేజను కలిసిన దర్శకుడు మారుతి, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ లైన్‌ను వినిపించారని, ఆ కథ వినగానే రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. రవితేజ మార్క్ కామెడీ టైమింగ్, ఎనర్జీకి.. మారుతి శైలి వినోదం తోడైతే థియేటర్లలో నవ్వుల పండగే అని అభిమానులు అప్పుడే అంచనాలు వేస్తున్నారు.

​ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మారుతి తెరకెక్కించిన భారీ చిత్రం 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో మారుతి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవితేజ కోసం ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. రవితేజ సైతం వైవిధ్యమైన సినిమాలతో పాటు తన వింటేజ్ మాస్ లుక్‌ను కోరుకునే అభిమానుల కోసం ఈ తరహా కథకు మొగ్గు చూపినట్లు సమాచారం.

​ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' భారీ బడ్జెట్‌తో నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే రవితేజతో 'ధమాకా', 'ఈగల్' వంటి చిత్రాలను, అలాగే మారుతితో కూడా గతంలో సినిమాలు చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. వీరి మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగానే ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా ఓకే అయిందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

Tags:    

Similar News