'Mass Jatara' Pre-Release Event: రాసిపెట్టుకోండి..సినిమా పెద్ద హిట్ అవుతది

సినిమా పెద్ద హిట్ అవుతది

Update: 2025-10-29 03:49 GMT

'Mass Jatara' Pre-Release Event: మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హీరో సూర్య అటెండ్ అయ్యారు. రవితేజ ఈ ఈవెంట్‌లో సినిమా విజయంపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, సహచర నటీనటులు,సాంకేతిక నిపుణులను అభినందించారు. "తమ్ముళ్లూ, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, రాసిపెట్టుకోండి! మీ అందరికీ పండగే." అని రవితేజ అభిమానులను ఉద్దేశించి చాలా ఉత్సాహంగా చెప్పారు.ఈ సినిమాలో కొత్త శ్రీలీల కనిపిస్తుందని, ఆమె అద్భుతంగా నటించిందని పేర్కొన్నారు.శివుడి పాత్ర చేసిన నవీన్ చంద్ర గురించి మాట్లాడుతూ, "అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్‌లో చూసి ఆశ్చర్యపోతారు" అని చెప్పారు.

రాజేంద్ర ప్రసాద్‌గారితో చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని, వారి కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని అన్నారు.దర్శకుడు భాను భోగవరపును ప్రశంసిస్తూ, "భాను భోగవరపు రూపంలో మనకు మరో పెద్ద డైరెక్టర్ రాబోతున్నాడు" అని చెప్పారు.నిర్మాత నాగవంశీ చెప్పినట్టే ఈ మూవీ మంచి హిట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వేదికపై ఎమోషనల్‌గా మాట్లాడినప్పుడు, రవితేజ స్పందిస్తూ, కష్ట సమయాల్లో భీమ్స్‌కు తాను అండగా నిలబడిన విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసుకున్నారు. భీమ్స్‌కు శక్తిగా ఉన్న వ్యక్తి తానేనని చెప్పారు.

ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన కోలీవుడ్ స్టార్ సూర్య గురించి మాట్లాడుతూ, "నాకు సూర్య అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత కలిశాం మేం. సూర్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది" అని తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ ,శ్రీలీల కలిసి 'తు మేరా లవర్' పాటకు డ్యాన్స్ కూడా చేసి అభిమానుల్లో జోష్ నింపారు.

Tags:    

Similar News