Kannappa Ticket Prices: కన్నప్ప టికెట్ల రేట్లు భారీగా పెంపు..
టికెట్ల రేట్లు భారీగా పెంపు..;
Kannappa Ticket Prices: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది . ఈ సినిమాకు ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ టికెట్ రేటుకు అదనంగా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లు రూ.206.50 వరకు, మల్టీప్లెక్స్లో రూ.236 వరకు పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు నుండి మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం మొదలయ్యాయి.
ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహించాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మించారు.