NC24: NC24 లో సైంటిస్ట్ గా మీనాక్షి చౌదరి
సైంటిస్ట్ గా మీనాక్షి చౌదరి
NC24: ప్రస్తుతం నాగ చైతన్య, నటి మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. వర్కింగ్ టైటిల్ NC24 సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ థ్రిల్లర్, మిస్టిక్ థ్రిల్లర్ జానర్ అని తెలుస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ (SVCC బ్యానర్), సుకుమార్ ('సుకుమార్ రైటింగ్స్' ద్వారా సమర్పిస్తున్నారు).
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి దక్ష పాత్రలో కనిపించనుంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ఒక ఆర్కియాలజిస్ట్ (పురావస్తు శాస్త్రవేత్త) పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర చాలా సాహసోపేతమైనది. సినిమాలో రహస్యాలను ఛేదించడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.మా NC24 నుంచి మీనాక్షి చౌదరిని మీ అందరికీ 'దక్ష'గా పరిచయం చేస్తున్నాము. రహస్యం యొక్క లోతుల్లో, ఆమె సత్యాన్ని వెలికితీస్తుంది. ఈ నవంబర్ NC24 నుంచి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని తెలిపారు మేకర్స్.
నాగ చైతన్య తన గత చిత్రం 'తండేల్' విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు, కాబట్టి 'విరూపాక్ష' వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తీసిన కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.