Meenakshi Chaudhary : బాలీవుడ్‌లోకి మీనాక్షి చౌదరి.. జాన్ అబ్రహంతో ఫోర్స్ 3లో ఛాన్స్?

జాన్ అబ్రహంతో ఫోర్స్ 3లో ఛాన్స్?

Update: 2025-09-04 07:14 GMT

Meenakshi Chaudhary : సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి విజయం సాధించిన మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె, బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించనున్న'ఫోర్స్ 3 సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. 'ఫోర్స్' సిరీస్‌లో ఇది మూడో భాగం. గత రెండు భాగాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'ఫోర్స్ 3'లో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించిందని, ఈ విషయంపై ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్‌లో అవకాశం రాగా, మీనాక్షి తెలుగులోనూ బిజీగానే ఉంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుంది. ఇంకా మరికొన్ని తెలుగు ప్రాజెక్టుల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమెకు ఉన్న మంచి నటన, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా 'ఫోర్స్ 3' ఆమెకు ఒక పాన్-ఇండియా బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడితేనే ఆమె బాలీవుడ్ అరంగేట్రంపై పూర్తి స్పష్టత వస్తుంది.

Tags:    

Similar News