Manashankar Vara Prasad’s Trailer Release Date: మెగా ధమాకా.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ డేట్ ఫిక్స్..
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ డేట్ ఫిక్స్..
Manashankar Vara Prasad’s Trailer Release Date: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ స్పీడప్ చేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం విక్టరీ వెంకటేశ్. చిరంజీవి, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయిలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు.
చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను సరికొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. జనవరి 7న భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై, మెగా రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి.