Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఏకంగా 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, చాలా తక్కువ టైమ్‌లోనే మోస్ట్ క్రూషియల్ సీన్స్‌ను కంప్లీట్ చేసింది. అంతేకాదండోయ్.. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయిందట! మేకర్స్ చెప్తున్న ప్రకారం.. ఇటీవల షూట్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవబోతుందట. అవుట్‌పుట్ చూసి టీమ్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషనల్ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తున్నారు. భాను-నందు మాటలు తూటాల్లా పేలబోతున్నాయి. ఇక మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ అందిస్తున్న బాణీలు మరోసారి థియేటర్లలో మోత మోగించడం ఖాయం.

అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేలా.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన పవర్-ప్యాక్డ్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రెడీ చేస్తున్నారు. అదే జోరుతో షూటింగ్‌ను కంటిన్యూ చేసి, రాబోయే సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tags: