Mega Heir Arrives: మెగా వారసుడొచ్చాడు..తండ్రి అయిన వరుణ్ తేజ్
తండ్రి అయిన వరుణ్ తేజ్
Mega Heir Arrives: నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10, 2025న మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి సినిమా షూటింగ్ నుంచి నేరుగా హాస్పిటల్ కు వెళ్లి వరుణ్ తేజ్ ,లావణ్యలకు విషెస్ చెప్పారు.
మనవడి రాకతో మెగా బ్రదర్ నాగబాబు ఆనందంలో మునిగిపోయారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ దంపతులకు విషెస్ చెబుతున్నారు.
వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి కలిసి 2017లో మిస్టర్ సినిమా చేశారు. అప్పటి నుంచి లవ్ లో ఉన్న వరుణ్, లావణ్య నవంబర్ 1, 2023న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి మొదటి బిడ్డ జన్మించడంతో మెగా కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది.