Megastar Chiranjeevi: ఇండస్ట్రీ సుభిక్షంగా ఉన్నపుడే నిజమైన సంక్రాంతి

నిజమైన సంక్రాంతి

Update: 2026-01-08 05:36 GMT

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా "మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

సాధారణంగా సంక్రాంతి అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కానీ చిరంజీవి తన సినిమాతో పాటు పోటీలో ఉన్న ఇతర సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకున్నారు."ఈ సంక్రాంతి మన తెలుగు పరిశ్రమది అవ్వాలి. కేవలం నా సినిమానే కాదు.. ప్రభాస్ 'రాజా సాబ్', రవితేజ సినిమా, శర్వానంద్ 'నారే నారే నడుమ మురారి', నవీన్ పోలిశెట్టి సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవ్వాలి.""పరిశ్రమలోని నిర్మాతలు, బయ్యర్లు అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే అది నిజమైన సంక్రాంతి" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమాలో వెంకటేష్'వెంకీ గౌడ్' అనే పాత్రలో కనిపిస్తున్నారు.వారిద్దరి కాంబినేషన్ గురించి చిరు ఇలా అన్నారు.వెంకీ నా మిత్రుడు, సోదర సమానుడు. తనతో కలిసి పనిచేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం కలిసి 18 రోజులు షూటింగ్ చేశాం, ఆ రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి."భవిష్యత్తులో కూడా వెంకటేష్‌తో కలిసి పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ.."అనిల్ నా బాడీ లాంగ్వేజ్‌ను, కామెడీ టైమింగ్‌ను బాగా స్టడీ చేశాడు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు వింటేజ్ చిరుని గుర్తు చేయాలనే పట్టుదలతో ఈ సినిమా తీశాడు."

షూటింగ్ చివరి రోజున ఒక కాలేజీ ఫేర్‌వెల్ పార్టీలో ఉన్నంత ఎమోషనల్‌గా ఫీలయ్యానని, అంత సరదాగా ఈ సినిమా షూటింగ్ జరిగిందని చెప్పారు.

ఈ సినిమా జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. "ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందని నా నమ్మకం" అని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News