Megastar Chiranjeevi’s ‘Khaidi’ Completes 42 Years: మెగాస్టార్ చిరంజీవి ఖైదీ మూవీకి 42 ఏళ్లు.. స్పెషల్ వీడియో రిలీజ్

స్పెషల్ వీడియో రిలీజ్

Update: 2025-10-28 14:36 GMT

Megastar Chiranjeevi’s ‘Khaidi’ Completes 42 Years: తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ, నేటికి (అక్టోబర్ 28) 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1983లో విడుదలైన ఈ సంచలన చిత్రం తెలుగు సినిమా గమనాన్ని మార్చడంలో కీలకపాత్ర పోషించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీమ్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ" అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను ఆనాటి స్వర్ణయుగపు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది.

చిరంజీవి స్టార్‌డమ్‌ను పెంచిన 'గేమ్‌ఛేంజర్'

'ఖైదీ' కేవలం ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌గా మాత్రమే మిగల్లేదు. టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాల ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసిన గేమ్‌ఛేంజర్‌గా నిలిచింది. ఈ చిత్రం విజయం చిరంజీవి స్టార్‌డమ్‌ను అమాంతం పెంచి, ఆయన్ను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అందుకే సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని ఆయన కెరీర్‌లో బెయిల్ దొరకని ఖైదీగా అభివర్ణిస్తారు.

వెలుగులోకి రాని ఆసక్తికర విషయాలు

ఇంతటి సంచలనం సృష్టించిన ఖైదీ వెనుక కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఈ కథను మొదట సూపర్‌స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోవడంతో, ఆ అద్భుత అవకాశం చిరంజీవిని వరించింది. మొదట కె. రాఘవేంద్రరావును దర్శకుడిగా అనుకున్నప్పటికీ, చివరికి కోదండరామిరెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ రాసిన కథ, సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయాయి.

బాక్సాఫీస్ వద్ద ఖైదీ రికార్డులు

ఖైదీ ఆ రోజుల్లోనే భారీ అంచనాలను అందుకుంది:

సుమారు రూ. 25 లక్షలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే విడుదలకు ముందే ఈ మూవీ రూ.70కోట్ల బిజినెస్ చేసింది. మొత్తం రూ. 4 కోట్లు వసూల్ చేసింది. ఈ చిత్రం వసూళ్లతో ఆ రోజుల్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది. ఈ సినిమా 100 రోజుల వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రం హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ అయ్యి, అక్కడ కూడా మంచి విజయం సాధించింది.

Tags:    

Similar News