‘Srinivasa Mangapuram’: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మెలోడీ సాంగ్ ‘రావే చెలియా’ విడుదల!
‘రావే చెలియా’ విడుదల!
‘Srinivasa Mangapuram’: జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా ‘రావే చెలియా’ అనే రొమాంటిక్ పాటను విడుదల చేశారు.
ఈ చిత్రంతో సూపర్‌స్టార్ కృష్ణ మనుమడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘రావే చెలియా’ సాంగ్ ఎంతో హృదయానికి హత్తుకునేలా, ప్రేమ భావనలతో కూడిన మెలోడీగా సాగింది. నాగ్ అర్జున్ రెడ్డి రాసిన భావోద్వేగమైన సాహిత్యాన్ని గాయకుడు కపిల్ కపిలన్ తన గాత్రంతో ఎంతో అందంగా ఆలపించారు. ఈ పాట విజువల్స్ లో జయకృష్ణ, రాషా తడాని మధ్య ఉన్న ప్రేమబంధం, అనురాగంతో పాటు విరహ వేదనను కూడా దర్శకుడు ఎంతో ప్రాణవంతంగా చూపించారు.
తన మార్కు తీవ్రత (Intensity), యాక్షన్ అంశాలతో పాటు ఓ సున్నితమైన ప్రేమకథను కూడా మేళవించి దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న గ్రాండ్‌గా విడుదల కానుంది.