Mirai: మిరాయ్ ..బొమ్మ హిట్టా?ఫట్టా?
బొమ్మ హిట్టా?ఫట్టా?
Mirai: యంగ్ హీరో తేజా సజ్జా సినిమా మిరాయ్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది. మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా వచ్చిన ఈమూవీ పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్స్, టెక్నికల్ అంశాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూసిన చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ప్రధానంగా సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ (VFX) అద్భుతంగా ఉన్నాయని, ఇది ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని చాలామంది చెబుతున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ అంశాలపై చూపించిన పట్టుకు మంచి మార్కులు పడ్డాయి.
హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో పాత్రలో బాగా నటించారని, అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. విలన్‌గా మంచు మనోజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారని, అతని స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
సినిమా కథ, కథనం బాగుందని, ముఖ్యంగా ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే, కొంతమందికి క్లైమాక్స్ ఇంకా మెరుగ్గా ఉండవచ్చని అనిపించిందంటున్నారు. సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ అని, అతని పాత్ర థియేటర్లలో సందడిని పెంచేసిందని చాలామంది అంటున్నారు.
హనుమాన్" తర్వాత తేజ సజ్జా నుంచి వచ్చిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని, మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిరాయ్" సినిమా టెక్నికల్ వండర్‌గా, ఒక విజువల్ ఫీస్ట్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఒక అడ్వెంచర్ డ్రామా అని చాలామంది అంటున్నారు.