Mohan Babu: బ్లడీ తలైవా అని పిలుస్తా

తలైవా అని పిలుస్తా;

Update: 2025-07-22 10:27 GMT

Mohan Babu: సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ బాబుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ఇద్దరూ దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్రులుగా కొనసాగుతున్నారు. పలు సందర్భాల్లో మోహన్ బాబు రజినీకాంత్ గురించి, వారి స్నేహం గురించి మాట్లాడారు. రజినీకాంత్‌తో తన స్నేహం సుమారు 50 సంవత్సరాల నాటిదని చెప్పారు. మద్రాస్‌లో ఇద్దరూ సినిమా పరిశ్రమలోకి ప్రవేశిస్తున్న తొలినాళ్లలో, ఎలాంటి స్టార్ డమ్ లేనప్పుడు కలిశారని, అప్పటి నుంచీ వారి బంధం కొనసాగుతోందని మరో సారి తమ స్నేహన్ని గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు.

రజినీ నా బెస్ట్ ఫ్రెండ్ రజినీకాంత్‌ను "బ్లడీ తలైవా" అని ప్రేమగా పిలుస్తా..అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అని మోహన్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రజినీ కూడా మోహన్ బాబు ఇంటికి తరచుగా వస్తూ ఉంటారు. ఇటీవలే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీని రజినీకాంత్ సందర్శించినప్పుడు, మోహన్ బాబు ఘన స్వాగతం పలికారు. రజినీకాంత్ తన స్వభావాన్ని మార్చుకుని ప్రశాంతంగా మారారని, తనను కూడా ఆ కోపాన్ని విడిచిపెట్టమని సలహా ఇచ్చారని మోహన్ బాబు తాజాగా వెల్లడించారు. రోజూ మూడు నుంచి నాలుగు మెసేజ్‌లు చేసుకుంటామని కూడా చెప్పారు.

Tags:    

Similar News