Mouni Roy Reacts: భర్తతో విడాకుల రూమర్లపై స్పందించిన మౌనీ రాయ్

స్పందించిన మౌనీ రాయ్

Update: 2026-05-14 06:31 GMT

Mouni Roy Reacts: బాలీవుడ్ నటి, ‘నాగిని’ ఫేమ్ మౌనీ రాయ్ తన వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రూమర్లపై మౌనీ రాయ్ తాజాగా స్పందించారు.

అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోండి.. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అసలు ఈ పుకార్లు ఎందుకు మొదలయ్యాయంటే.. మౌనీ రాయ్, సూరజ్ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం.

అంతేకాదు, మౌనీ రాయ్ గత కొద్ది రోజులుగా భర్తతో ఉన్న ఫోటోలేవీ పోస్ట్ చేయడం లేదు. మరోవైపు, సూరజ్ నంబియార్ ఇన్‌స్టా ఖాతాలో వారి పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం, ప్రస్తుతం ఆయన అకౌంట్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. సూరజ్ తన అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు సమాచారం.

2022 జనవరిలో అంగరంగ వైభవంగా మౌనీ రాయ్ - సూరజ్ నంబియార్ వివాహం జరిగింది. బుల్లితెరపై 'నాగిని'గా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్.. 'గోల్డ్', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘వేదా’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఈ రూమర్లపై ఆమె ఘాటుగా స్పందించడంతో ఈ వార్తలకు తెరపడినట్లయింది.

Tags:    

Similar News