Allu Arjun: మా డాడీ ..ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా: అల్లు అర్జున్

ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా: అల్లు అర్జున్

Update: 2026-03-13 05:09 GMT

Allu Arjun: హైదరాబాద్‌ కోకాపేటలో 'అల్లు సినిమాస్‌' (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ .. తన తండ్రి అల్లు అరవింద్‌ను 'ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా' గాఅభివర్ణించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.

ఈ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పు గల డాల్బీ స్క్రీన్ ఆసియాలోనే అతిపెద్దదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్మించామని తెలిపారు. తన తాత అల్లు రామలింగయ్య పేరు నిలబెట్టేలా, తన తండ్రి నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఎమోషనల్ అయ్యారు. బిజీ షెడ్యూల్‌లో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అల్లు సినిమాస్ ప్రత్యేకతలు

హైదరాబాద్ కోకాపేటలలో నిర్మించిన అల్లు స్టూడియోస్ ఆవరణలో మొత్తం 4 స్క్రీన్లు (అందులో ఒకటి భారీ డాల్బీ సినిమా స్క్రీన్) ఉంటాయి. డాల్బీ విజన్ 4K ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్‌ను అభినందిస్తూ.. తెలుగు సినిమా గ్లోబల్ లెవల్‌కు చేరుకుందని, హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకునేలా టాలీవుడ్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News