Anil Ravipudi: కల నెరవేరింది.. నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అదే - అనిల్ రావిపూడి

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అదే - అనిల్ రావిపూడి

Update: 2025-12-31 05:39 GMT

Anil Ravipudi: వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్న తన జీవితకాల వాంఛ మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను చదువుకున్న గుంటూరు విజ్ఞాన్ కాలేజీలోనే ఈ సినిమా పాటను లాంచ్ చేయడం ఆయనకు ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరవనున్నారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి చేసే డ్యాన్స్, కామెడీ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని, వారిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలన్న ఫ్యాన్స్ కల ఈ సినిమాతో నిజం కాబోతోందని అనిల్ ధీమా వ్యక్తం చేశారు.

కెరీర్ బూస్ట్ ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం

2025లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిందని, ఆ సినిమా ఇచ్చిన విజయంతోనే తాను మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నానని అనిల్ తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్‌లను ఇప్పటికే డైరెక్ట్ చేసిన అనిల్.. ఇప్పుడు చిరంజీవిని కూడా డైరెక్ట్ చేయడం ద్వారా టాలీవుడ్ లెజెండరీ హీరోలతో పని చేసే అవకాశం దక్కించుకున్నట్లయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రం, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News