N. Chandrababu Naidu Biopic: పాన్ వరల్డ్ మూవీగా చంద్రబాబు బయోపిక్

చంద్రబాబు బయోపిక్

Update: 2026-04-23 03:36 GMT

N. Chandrababu Naidu Biopic: ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర నిర్మాణం వరకు సాగిన అలుపెరగని పోరాటం. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఈ అపర చాణక్యుడి జీవిత ప్రయాణం ఇప్పుడు సెల్యులాయిడ్ పైకి రాబోతోంది. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో ఆయన పాత్రలు కనిపించినా, పూర్తిస్థాయి బయోపిక్ రాకపోవడం ఒక వెలితిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడబోతోంది.

అమరావతి రైతుల ఆవేదనను, త్యాగాన్ని 'రాజధాని ఫైల్స్' సినిమాతో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భాను.. ఇప్పుడు ఈ భారీ బయోపిక్‌కు శ్రీకారం చుడుతున్నారు. కేవలం ఒక రాజకీయ నాయకుడి కథగానే కాకుండా, ఒక సామాన్య రైతు బిడ్డ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో చూపించబోతున్నారు. బాబు జీవితంలోని ప్రతీ మలుపులోనూ ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ దాగి ఉన్నాయని దర్శకుడు భాను చెబుతున్నారు.

ఈ బయోపిక్ గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకో, లేదా భారత్‌కో పరిమితం కాదు. చంద్రబాబు నాయుడుహైటెక్ సిటీ స్థాపన ద్వారా ఐటి రంగంలో తీసుకొచ్చిన విప్లవం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసింది. అందుకే ఈ చిత్రాన్ని 'పాన్ వరల్డ్' మూవీగా వివిధ ప్రపంచ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Tags:    

Similar News