S. Thaman’s Sensational Post Goes Viral: బ్లాక్ అండ్ వైట్ పిక్‌లో జూనియర్ .. థమన్ సంచలన పోస్ట్!

థమన్ సంచలన పోస్ట్!

Update: 2026-05-09 06:02 GMT

S. Thaman’s Sensational Post Goes Viral: సంచలన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు ఎప్పుడూ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. కేవలం అప్‌డేట్స్ ఇవ్వడమే కాకుండా, రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆయన ఇచ్చే క్రేజీ హింట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా థమన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. టాలీవుడ్‌లో సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది.

థమన్ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ పిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త మేకోవర్‌లో దర్శనమిచ్చారు. ఒంటిపై ఉన్న బరువునంతా తగ్గించి, ముఖానికి సరిపోయేలా షార్ప్ గడ్డం, తన సిగ్నేచర్ కర్లీ హెయిర్‌ని మార్చి కొత్త హెయిర్ స్టైల్‌తో క్లాస్ అండ్ మాస్ కలయికగా కనిపించారు. నోటి చివర ఒక టూత్‌పిక్ పెట్టుకుని, ఆయన ఇచ్చిన ఇంటెన్స్ పోజు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పిక్‌కు థమన్ ఒక 'బాంబ్ బ్లాస్ట్' ఎమోజీని జత చేయడంతో ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయింది.

ఈ ఫొటోకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీని వెనుక థమన్ ప్లే చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే పెద్ద చర్చకు కారణమైంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ "#OG" లోని పవర్‌ఫుల్ విలన్ 'ఓమి' (Omi) థీమ్ మ్యూజిక్‌ను ఈ పిక్‌కు థమన్ యాడ్ చేశారు. ఎన్టీఆర్ పిక్‌కు, ఓజీ మ్యూజిక్‌కు లింక్ ఏంటని ఫ్యాన్స్ అంతా తలలు పట్టుకుంటున్నారు.

ఈ కన్ఫ్యూజన్ వెనుక ఒక భారీ ప్లాన్ ఉందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక ప్రతిష్టాత్మక మైథలాజికల్ ప్రాజెక్ట్ "గాడ్ ఆఫ్ వార్" (God of War) రూపుదిద్దుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ గ్రాఫికల్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేసేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.

Tags:    

Similar News