Nabha Natesh: చీరలో నభా నటేశ్ వయ్యారాలు.. ఫోటోలు వైరల్
ఫోటోలు వైరల్;
Nabha Natesh: నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేశ్. ఆ తర్వాత 'అదుగో' సినిమాలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ అందుకోలేకపోయింది. కానీ రామ్ పోతినేనికి జోడిగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ఫుల్ క్రేజ్ తె చ్చుకుంది. దీంతో ఈభామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో, 'డార్లింగ్' వంటి సినిమాల్లో నటించి మె ప్పించింది. అయితే ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ 'స్వయంభు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది నభా. ఇందులో నిఖిల్ సరసన యాక్షన్ పీరియాడిక్ డ్రామాలో కనిపించనుంది. దీంతో పాటు పాస్ఇండియా మూవీ 'నాగాభరణం'తోనూ అలరించ నుంది. మరికొన్ని చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి. ఇక సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్లోనే ఉంటుంది ఈవయ్యారి. ఎప్పటికప్పుడు లేటెస్టు పిక్సేషేర్ చేస్తూ కుర్రాళ్ల మనసును దోచేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో సభా మెరిసిపోయింది. బంగారు రంగు చీర, మెరూన్ బ్లౌజ్ తో నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. అరుణోదయ కాంతుల్లో సన్నివేశాలుగా కనిపించే ఈ ఫొటోలు ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి. రెట్రో టన్ తో మిళిత మైన ఈ స్టిల్ తో నభా అందాలను మరింత కొత్తగా ఎలివేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వయ్యారి ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.