Bigg Boss House: బిగ్ బాస్లో అతనికే నాగబాబు సపోర్ట్

అతనికే నాగబాబు సపోర్ట్

Update: 2025-09-09 08:57 GMT

Bigg Boss House: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సారి డబుల్ డోస్ డబుల్ హౌస్ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. ఈ షో 15 వారాల పాటు జరగనుంది. ఇక ఈ షలో ఏడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నటుడు భరణికి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.

బిగ్ బాస్ సీజన్ 9' లోకి అడుగుపెడుతున్నందుకు ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో అతనికి కావాల్సిన గుర్తింపు, విజయం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన పోస్టు చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగబాబు, భరణి మధ్య స్నేహం లేదా సంబంధం గురించి చాలా మంది నెటిజన్లు చర్చించుకున్నారు.

నాగబాబు వ్యాఖ్యలు భరణికి బిగ్ బాస్ హౌస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆయనకు బయట సపోర్ట్ కూడా పెరగనుంది. భరణి ఫ్యాన్స్ కూడా నాగబాబుకి థ్యాంక్స్ చెప్పారు.

Tags:    

Similar News