Naga Chaitanya: సిక్స్ ప్యాక్ లుక్ తో నాగచైతన్య సెన్సేషన్
నాగచైతన్య సెన్సేషన్
Naga Chaitanya: నాగ చైతన్య తన అప్‌కమింగ్ మూవీ ‘వృషకర్మ’ కోసం నెవర్ బిఫోర్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ప్రెజెంట్ చేసే వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాను పోషిస్తున్న అర్జున్ పాత్రను నేచురల్‌గా చూపించేందుకు చైతూ ఎంతగా శ్రమిస్తున్నాడో ఈ స్టిల్‌తో అర్థమవుతోంది. ఈ రఫ్ అండ్ రగ్డ్ లుక్ సినిమాలో ఉండబోయే హై-ఆక్టేన్ యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ని సూచిస్తోంది. ఇది చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని ఇంటెన్స్ ఆన్‌స్క్రీన్ అవతార్‌లలో ఒకటిగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మిస్టరీ, మైథాలజీ, యాక్షన్ అంశాలతో ఆడియెన్స్‌కు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతుందని మేకర్స్ అన్నారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.