Naga Chaitanya ‘Vrushakarma’ : తెలుగు చిత్రసీమ గర్వించేలా ‘వృషకర్మ’: నాగచైతన్య
| నాగచైతన్య
Naga Chaitanya ‘Vrushakarma’ : ఒక అద్భుతమైన విజన్‌తో రూపొందిన ‘వృషకర్మ’ తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని నాగచైతన్య పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కు మీనాక్షి చౌదరి కథానాయిక. స్పర్ష్ శ్రీవాస్తవ ముఖ్యపాత్ర పోషించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో ఈ చిత్రం రూపొందింది. డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుధవారం నెల్లూరులో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఐదు వేల ఏళ్ల పురాతనమైన ఒక అతీంద్రియ శక్తిని పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వేడుకను ఉద్దేశించి నాగచైతన్య మాట్లాడుతూ, “ఒక కొత్త ఆలోచనతో కార్తీక్ ఈ కథని రాశారు. ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో విఎఫ్ఎక్స్ ఉంటుంది. రెండేళ్ల పాటు కష్టపడి ఈ అనుభవాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది గొప్ప దర్శకులు వచ్చి దేశమంతా సత్తా చాటుతున్నారు. ఆ జాబితాలో కార్తీక్ చేరబోతున్నారు. మీనాక్షి, స్పర్ష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు” అని అన్నారు.
ఈ చిత్రంలో నాగచైతన్య పురావస్తు శాస్త్రవేత్త అర్జున్ పాత్రలో నటించారు. పురాతన గుహల శాసనాలను అర్థం చేసుకుంటూ రాజవంశం, భవిష్యత్తు ప్రవచనాలతో ముడిపడిన ఒక మర్మమైన ప్రయాణం ఇందులో చిత్రీకరించబడింది. మీనాక్షి చౌదరి సాహసోపేత పాత్రలో కనిపించగా, స్పర్ష్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటించారు. జయరామ్, సత్య, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రల్లో ఉన్నారు. సంగీతం బి.అజనీష్ లోకనాథ్ అందించగా, సినిమాటోగ్రఫీ రఘుల్ డి హెరియన్ చేశారు.
ట్రైలర్ విడుదలతో చిత్రం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు కార్తీక్ దండు గతంలో ‘విరూపాక్ష’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘వృషకర్మ’ కూడా అదే స్థాయిలో అద్భుత విజువల్స్, సస్పెన్స్‌తో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విదేశాల్లో డిసెంబరు 3 రాత్రి ప్రీమియర్ షోలు ఉండే అవకాశం ఉంది.
ఈ వేడుకలో చిత్రబృందం మొత్తం పాల్గొంది. నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు. ప్రేక్షకులు కొత్త సినీ అనుభవాన్ని పొందుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా మారనున్న ‘వృషకర్మ’పై అందరి చూపు ఇప్పుడు డిసెంబరు 4పైనే నిలిచి ఉంది.