Naga Shaurya’s ‘Bad Boy Karthik’ Trailer: నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్

Update: 2026-04-07 08:06 GMT

Naga Shaurya’s ‘Bad Boy Karthik’ Trailer: యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇప్పుడు తన రూటు మార్చాడు. కంప్లీట్ మాస్ అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. రామ్ దేశినా దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో నాగశౌర్య ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగిన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా హారీస్ జయరాజ్ అద్భుతమైన మ్యూజిక్, రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. సముద్రఖని, సాయికుమార్ వంటి హేమాహేమీల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపిస్తున్న శ్రీదేవి విజయ్ కుమార్.. ఈ సినిమాలో తాను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశానని, ఇది ఆడియన్స్‌కు కచ్చితంగా నచ్చుతుందని చెప్పారు. విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుల కాంబినేషన్ హైలైట్‌గా ఉండబోతోంది.

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదని, ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నారని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News