Nagarjuna: 100 కోట్లతో నాగ్ 100 సినిమా?
నాగ్ 100 సినిమా;
Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రజెంట్ 'కుబేర', 'కూలీ' మూవీల్లో సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ పోషిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన కెరీర్లో ల్యాండ్మార్ కు మూవీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నాగ్ తన 100వ చిత్రాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తా రని.. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోందని టాక్. కొత్త కథలు, కొత్త దర్శకులతో ఎల్లప్పుడూ రిస్క్ లు తీసుకున్నట్లే.. ఈ సారి కూడా నాగ్ అలాగే చేశారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే కింగ్ 100 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని.. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని వినికిడి. జులైలో ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ను నాగార్జున బర్త్ డే ఆగస్టు 29న రివీల్ చేస్తారనే టాక్ సినీ సర్కిల్స్ లోనూ వినిపిస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు, నాగ్ 100వ చిత్రం కోసం ఇప్పటినుంచే ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి. 'నితం ఓరువానం' అనే సినిమా ద్వారా కార్తీక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. బట్ ఇక్కడ మాత్రం సినిమా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్లే తెలుస్తోంది.