Ram Charan Explains: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. జనవరి 31న జన్మించిన తమ కుమారుడికి శివరామ్ అని, కుమార్తెకు అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వారు వెల్లడించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ నామకరణ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది.

పేర్ల వెనుక ఉన్న విశిష్టత ఇదే

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్.. ఈ పేర్లను ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్రత్యేక కారణాలను, వాటి ప్రాముఖ్యతను వివరించారు..

శివరామ్: ఈ పేరులో శివుడు, రాముడి నామాలు ఉండటంతో పాటు తన తండ్రి చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ కూడా కలిసి వచ్చేలా దీనిని ఎంపిక చేశారు.

అన్విరా దేవి: ఈ పేరుకు అపరిమితమైన ధైర్యం, దైవికమైన స్త్రీ శక్తి అని అర్థం. దైవత్వం ఉట్టిపడేలా ఈ పేరును నిర్ణయించారు.

కుటుంబ సభ్యుల భాగస్వామ్యం

తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో, అందరి సలహాల మేరకు ఈ పేర్లను ఖరారు చేశామని చరణ్ తెలిపారు. 2023లో జన్మించిన క్లింకారా తర్వాత శివరామ్ అన్విరా దేవి చరణ్-ఉపాసన దంపతులకు వరుసగా రెండో, మూడో సంతానం.

Tags: