Nandamuri Balakrishna: బాలకృష్ణతో మరోసారి జోడీగా
మరోసారి జోడీగా
Nandamuri Balakrishna: మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించేందుకు సిద్ధమవుతున్నారు 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ. ఇటు వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య.. అటు సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కొరటాల శివతో చేతులు కలిపారు. బాలయ్య కెరీర్‌లో ఇది 112వ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా, పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కొరటాల సిద్ధం చేశారు.
ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరోసారి బాలయ్య సరసన మెరవబోతున్నారు. గతంలో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో నటించిన ఈ జంట.. ఏడేళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేయబోతోంది. బాలయ్య సినిమాల్లో విలన్ లేదా కీలక పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది.
అన్నగారి బయోపిక్‌లో జంటగా మెప్పించిన బాలయ్య-విద్యల కెమిస్ట్రీ.. కొరటాల మార్క్ మేకింగ్‌లో ఎలా ఉండబోతుందో చూడాలి.