‘Bloody Romeo’ Title Glimpse: నాని బర్త్ డే స్పెషల్.. బ్లడీ రోమియో టైటిల్ గ్లింప్స్

బ్లడీ రోమియో టైటిల్ గ్లింప్స్

Update: 2026-02-24 07:32 GMT

‘Bloody Romeo’ Title Glimpse: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు (ఫిబ్రవరి 24) సందర్భంగా సోషల్ మీడియాలో అప్‌డేట్స్ హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) టైటిల్ గ్లింప్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బ్లడీ రోమియో దర్శకుడు సుజీత్ 'సాహో, ఓజీ' (OG) లాంటి భారీ స్టైలిష్ యాక్షన్ సినిమాల తర్వాత సుజీత్ ఎంచుకున్న సబ్జెక్ట్ ఇది. నాని లాంటి పెర్ఫార్మర్‌ను సుజీత్ ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న క్యూరియాసిటీ పెరిగింది. టైటిల్ చూస్తుంటేనే ఇది ఒక వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. 'రోమియో' అంటే లవ్ స్టోరీ అనిపిస్తున్నా, దానికి 'బ్లడీ' అని తగిలించడంతో ఇదొక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోయింది.

ఈ సినిమా కథ మొత్తం యూరప్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. విజువల్స్ చాలా గ్రాండ్‌గా, స్టైలిష్‌గా ఉండే అవకాశం ఉంది. 'హాయ్ నాన్న' వంటి సాఫ్ట్ సినిమాల తర్వాత నాని మళ్ళీ కంప్లీట్ మాస్/యాక్షన్ అవతార్‌లోకి మారుతున్నారు. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడరని స్పష్టమవుతోంది. నాని ఈసారి తన సినిమాలతో ప్రయోగాలు చేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ యాక్షన్ సినిమాలతో రూల్ చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

Tags:    

Similar News