NBK111 Update: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక 111వ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 6న సినిమా అధికారిక టైటిల్‌తో పాటు విడుదల తేదీ వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు సోమవారం వెల్లడించారు. ఇటీవల జరిగిన షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం కావడంతో మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయపడినప్పటికీ సినిమా విడుదలలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆయన భావిస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే ఈ చిత్రాన్ని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్

గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ముంబై నేపథ్యంలో పూర్తిస్థాయి యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

Tags: