Vaishnavi Chaitanya: హైదరాబాద్‌కు చెందిన నటీమణుల్లో కొందరు మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు, పేరు సంపాదించుకోగలుగుతున్నారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో ముంబై, కేరళ, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. తెలుగు అమ్మాయిలకు మాత్రం చిన్న సినిమాల్లో లేదా సహాయ పాత్రల్లోనే ఎక్కువగా అవకాశాలు దక్కుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైష్ణవి చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. 'బేబీ' వంటి హిట్ సినిమాతో వైష్ణవి చైతన్య మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఇటీవల ఆమెకు వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆమె నటించిన 'ఎపిక్' సినిమాపై చాలా అంచనాలు ఉండగా, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది.

ఇదిలా ఉంటే, ఇటీవల కొన్ని మీడియా సంస్థలు వైష్ణవి చైతన్య వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రచురించాయి. ఓ తెలుగు సినీ ప్రముఖుడితో ఆమెకు సంబంధం ఉందంటూ వార్తలు రాశాయి. ఈ వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అయితే, తనపై వస్తున్న ఇలాంటి వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో వైష్ణవి చైతన్య చాలా బాధపడుతున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అసలు తాను ఎవరితోనూ పోటీ పడటం లేదని, ఏ అగ్ర నటుడికీ పోటీగా లేనని భావిస్తున్న ఆమె.. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి, సినిమాల పరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం ఒకవైపు, వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు మరోవైపు వైష్ణవి చైతన్యను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.

Tags: