Niharika Konidela: వరుణ్ తేజ్ - లావణ్య ప్రేమ విషయం నాకు అప్పుడే తెలిసింది.. నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు..

నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు..

Update: 2026-03-23 07:13 GMT

Niharika Konidela: మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా తన అన్నయ్య వరుణ్ తేజ్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన రాకాస సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ప్రేమాయణం తనకు ఎలా తెలిసిందో వివరిస్తూ నవ్వులు పూయించారు.

ఆ పార్టీలోనే అసలు విషయం లీక్..

వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమ వ్యవహారం సుమారు నాలుగేళ్ల పాటు రహస్యంగా సాగింది. దీనిపై నిహారిక స్పందిస్తూ.. "అన్నయ్య ఎవరినీ తన బర్త్‌డే పార్టీలకు పిలవడు. అలాంటిది ఒకసారి అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు లావణ్య రావడం చూసి నాకు అనుమానం వచ్చింది. అప్పుడే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని నాకు అర్థమైపోయింది" అని నిహారిక వెల్లడించారు.

అన్నయ్య ఇంట్రావర్ట్ కాదు: "అందరూ వరుణ్ అన్నయ్యను చాలా సైలెంట్ అనుకుంటారు కానీ, వాడు అస్సలు ఇంట్రావర్ట్ కాదు. ఇంట్లో వాడు ఒక పెద్ద రౌడీ.. నన్ను విపరీతంగా ఏడిపిస్తుంటాడు" అని తన అన్నయ్యలోని మరో కోణాన్ని బయటపెట్టారు.

రెండో పెళ్లిపై నిహారిక స్పష్టత:

ఇదే ఇంటర్వ్యూలో నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. "మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?" అని అడిగిన ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చారు.. "తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటాను. అయితే ప్రస్తుతం నా దృష్టి అంతా నా కెరీర్, నిర్మాణ రంగంపైనే ఉంది. పెళ్లి గురించి ప్రత్యేకంగా ఇప్పుడే ప్లాన్ చేయడం లేదు" అని స్పష్టం చేశారు.

నిర్మాతగా బిజీ బిజీ:

ప్రస్తుతం నిహారిక తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా విభిన్నమైన కథలను వెండితెరకు పరిచయం చేస్తూ బిజీగా ఉన్నారు. ‘రాకాస’ సినిమాతో మంచి విజయం సాధిస్తామనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

Tags:    

Similar News